ETV Bharat / state

ఇంటర్​ ఫలితాలతో.. ఇద్దరు విద్యార్థులు మృతి - ఇంటర్​ ఫలితాలతో ఇద్దరు విద్యార్థులు మృతి

ఇంటర్​ ఫలితాలు పలువురి కుటంబాల్లో సంతోషాన్ని నింపగా.. మరికొన్ని కుటుంబాల్లో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఇంటర్​ ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చాయని ఒకరు, రెండు సబ్జెక్టులు పాస్​ కాలేదని మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రెండు విషాద ఘటనలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకున్నాయి.

inter-result-pass-fail-two-students-died-at-siddipet
ఇంటర్​ ఫలితాలతో.. ఇద్దరు విద్యార్థులు మృతి
author img

By

Published : Jun 19, 2020, 11:04 PM IST

ఇంటర్​ ఫలితాలతో ఇద్దరు విద్యార్థులు ఆవేదన చెంది ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పరిధిలోని క్యాసారానికి చెందిన ఆగుల్ల సాయిలు కుమార్తె శ్రావణి పట్టణంలోని ఓ ప్రభుత్వ కళాశాలలో సీఈసీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. గురువారం వెలువడిన ఫలితాల్లో 266 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. కానీ మార్కులు తక్కువగా వచ్చాయని మనస్థాపంతో విద్యార్థిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

గజ్వేల్ పట్టణానికి చెందిన మహంకాళి బద్రీనాథ్ పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. గురువారం వెలువడిన ఫలితాల్లో రెండు సబ్జెక్టులు తప్పడం వల్ల మనస్థాపం చెందిన విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తండ్రి నాలుగేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తల్లి అరుణ, సోదరి ఉన్నారు. మృతుడు బద్రినాథ్ చదువుకుంటూనే పనులు చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచేవాడు. అతని మృతితో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.

ఇదీ చూడండి : 'మాకు రహస్య అజెండా లేదు.. రైతులకు లబ్ధిచేయడమే లక్ష్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.