సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్ డిపో పక్కన ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ, రాస్తారోకో నిర్వహించారు. పక్షం రోజులుగా ధాన్యాన్ని తీసుకొచ్చి ఆర పెడుతున్నామని, కొనుగోలు చేయడానికి ఇంతవరకు అధికారులు ఇటువైపు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిరోజు మబ్బులు వచ్చి చుట్టుపక్కల గ్రామాల్లో వర్షాలు పడుతున్నాయని, ధాన్యం అమ్ముకోవడానికి ఎండలో ఎదురుచూస్తున్నామని రైతులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటవెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
- ఇదీ చదవండి ట్రాక్టర్ బోల్తా... ఐదుగురు మృతి