Kedarnath Annadana Seva Samiti In Siddipet: రక్తం గడ్డ కట్టే మంచులో శివ భక్తులకు దక్షిణ భారతదేశంలో మొదటి లంగర్‌గా సిద్దిపేట ఉండడం సంతోషకరమైన విషయమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట శరభేశ్వరాలయంలో కేదార్ నాథ్ అన్నదాన సేవ సమితి ఆధ్వర్యంలో.. కేదార్ నాథ్ యాత్రికులకు సోన్ ప్రయాగ్ వద్ద ఉచితంగా మూడోసారి తెలుగు వారి భోజనం అందించేందుకు పంపుతున్న ఆహార పదార్థాల లారీకి పూజా కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అన్నదానానికి మించిన దానం మరొకటి లేదని.. మానవ సేవయే మాధవ సేవ అని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. శివ భక్తులకు సేవ చేస్తే ఆ పరమ శివునికి సేవ చేసినట్లేనని పేర్కొన్నారు. భక్తిలోనూ, సేవలోనూ, అభివృద్ధిలోనూ సిద్ధి పేట ముందంజలో ఉంటూ .. అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. చాలా మంది వ్యక్తులు మన దగ్గర నేర్చునే విధంగా.. మనము సిద్ధమయ్యామని ఇక్కడి వాస్తవ్యులు సగర్వంగా చెప్పుకోవాలన్నారు.
దేశంలో కేదార్నాథ్ దేవాలయానికి వెళ్లే దక్షిణాది భక్తులకు గడ్డ కట్టే చలిలో.. సిద్ధిపేటకు చెందిన వ్యక్తినే ఉచితంగా అన్నదానం చేయనుండడం అందరం ఆ జిల్లాకు చెందిన వ్యక్తులం అయినందుకు గర్వపడాలన్నారు. సేవా భావం కలిగిన మనుషులు ఇక్కడే ఉన్నారన్నారు. కేదార్ నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సమితి ప్రతినిధులను కొనియాడారు. కేదార్ నాథ్ అన్నదాన సేవా సమితికి తనవంతు సహకారాన్ని అందించనున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. అనంతరం పట్టణ పారుపల్లి వీధిలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ వార్షికోత్సవంలో హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
ఆరోగ్య సిద్దిపేటనే లక్ష్యం: ఈ సిద్ధిపేట నియోజకవర్గాన్ని చూసి కొంత మంది ఈర్శ్య చెందుతున్నారని మంత్రి అభిప్రాయపడ్డారు. అన్ని రంగాల్లో ఇక్కడి వారు.. ఈ ప్రాంతం ముందంజలో ఉంటూ.. ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. దీనితో పాటు ఆరోగ్య సిద్దిపేటలో భాగంగా మితమైన ఆహారం తీసుకుంటే అమితమైన ఆరోగ్యం పొందవచ్చునని తెలియజేశారు. అందుకు మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని హితవు పలికారు. నిత్యం యోగా, ప్రాణాయామం ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చేయాలని కోరారు.
"అన్నదానాన్ని మించన దానం మరొకటి లేదు. మానవ సేవయే మాధవ సేవ. శివ భక్తులకు సేవ చేస్తే ఆ పరమ శివునికి చేసినట్లే. భక్తిలోనూ, సేవలోనూ, అభివృద్ధిలోనూ సిద్ధిపేట ముందంజలో ఉంటుంది. అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. దేశంలోని కేదార్నాథ్ ఆలయానికి వెళ్లే దక్షిణాది భక్తులకు గడ్డ కట్టే చలిలో సిద్దిపేటకు చెందిన వ్యక్తినే ఉచితంగా అన్నదానం చేస్తున్నారు. దీనికి మనమెంతో గర్వపడాలి." - హరీశ్‌రావు, ఆరోగ్య శాఖ మంత్రి
ఇవీ చదవండి: