సిద్దిపేట రైతు బజారులో ఇర్కోడ్ మహిళా సమాఖ్య ఫుడ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ఆన్ వీల్స్ వాహనాన్ని, రైతు బజార్లో స్టాల్ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఇర్కోడ్ గ్రామ మహిళలు మాంసం పచ్చళ్లు, మాంసం ఆహార పదార్థాలు క్రయ విక్రయాలు జరిపేందుకు రైతు బజారులో స్టాల్ ఏర్పాటు చేసుకున్నాం. అదే విధంగా ఈ తొక్కులు అన్నీ చోట్ల ప్రజలకు అందుబాటులో లభించేలా ప్రత్యేక " మీట్ ఆన్ వీల్స్ " వాహనాన్ని ప్రారంభించుకోవడం సంతోషకరమని మంత్రి అన్నారు.
ప్రతి రోజు ఉదయం ఈ వాహనం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లోని కాలనీల్లోకి వెళ్లి మాంసం ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరుపుతుందని చెప్పారు. ప్రతి రోజు సాయంత్రం కోమటి చెరువు, బస్టాండు, జనవాసా రద్దీ ప్రాంతాల్లో ఈ ఉత్పత్తులు అమ్మడం జరగుతుంది. రాష్ట్రంలో నూటికి 90 మంది మాంసం తింటారని, సెర్ప్ సహకారంతో మహిళలు అదనంగా ఆదాయ వనరులు పొందుతారని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ మేరకు మహిళా సంఘాల వద్ద మటన్ పచ్చడి (230 గ్రా) రూ.300లకు మంత్రి హరీశ్ రావు కొనుగోలు చేశారు.
ఇదీ చూడండి : వైద్యం కోసం సర్కారు ఆస్పత్రికి వెళ్తున్నారా... స్మార్ట్ఫోన్ మరచిపోకండి