సిద్దిపేట జిల్లా కేంద్రంలో పీజీ కళాశాల నూతన భవనానికి, మహిళల వసతి గృహాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, జడ్పీ ఛైర్మన్ రోజాశర్మ ప్రారంభించారు. 2014లో ఈ కళాశాల భవనానికి రూ.19 కోట్లు మంజూరు చేసినట్లు హరీశ్‌రావు తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ నాలుగు కోర్సులున్నాయని, మరో రెండు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం తరఫున రావాల్సిన మరో రూ. 10 కోట్ల మంజూరు కోసం కృషిచేస్తానని తెలిపారు. రూసా నిధులు తీసుకువచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
ఇవీ చూడండి: రమణీయంగా మారిన తెలంగాణ నయాగరా