సిద్దిపేటలో జరిగిన అధికారుల తనిఖీల్లో నగదు దొరికినా.. భాజపా నాటకాలు ఆడుతోందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. దొంగే.. 'దొంగదొంగ' అని అరిచినట్లుగా వారి పరిస్థితి ఉందని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటాపై తాను విసిరిన సవాల్ నుంచి ప్రజల దృష్టిని మళ్లీంచడానికే ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. డబ్బులతో పట్టుబడ్డ వ్యక్తే.. అవి రఘునందన్‌రావుకు చెందినవని చెప్పినట్లు ఆధారాలున్నాయని... పోలీసులు చెబుతున్నారని హరీశ్‌రావు తెలిపారు. భాజపా గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టందుకు.. పోలీసులు వీడియోల్ని బహిర్గతం చేయాలని కోరారు.
దుబ్బాక ఉపఎన్నికల నేపథ్యంలో తెరాస నేతల ఇళ్లలోనూ సోదాలు జరిగాయని హరీశ్‌రావు వివరించారు. నగదు దొరకడం వల్ల ఏంచేయాలో తోచక.. ఇటువంటి దుష్ప్రచారానికి రఘునందన్‌రావు పాల్పడుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... వీరి ట్రాప్‌లో పడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
ఎన్నికల్లో దరావతు కూడా దక్కదనే అసహనంతోనే భాజపా గోబెల్స్ ప్రచారం చేస్తోందని.. తెరాస కార్యకర్తలు శాంతియుత మార్గంలో దీటుగా తిప్పుకొట్టాలని హరీశ్‌రావు సూచించారు.
ఇవీచూడండి: దుబ్బాకలో వేడెక్కిన రాజకీయం... రణరంగంగా సిద్దిపేట