సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. వర్షం ధాటికి దిలాల్పూర్ గ్రామంలోని ఓ రైతు ధాన్యం కుప్ప కొట్టుకుపోయింది. వాన కారణంగా పాడైన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు వేడుకున్నారు.
అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని గజ్వేల్ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు మాదాసు అన్నపూర్ణ అన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి: 'మరింత కఠినంగా లాక్డౌన్... 21 వేల మంది వాహనదారులపై కేసులు'