Google Maps Mislead Van Driver : ఓ గూడ్స్‌వ్యాన్ గూగుల్ మ్యాప్ ఆధారంగా గమ్యస్థలానికి చేరుకోవాల్సి ఉండగా, ఏకంగా ఓ ప్రాజెక్టులోకి తీసుకెళ్లింది. ప్రాజెక్ట్ దగ్గర గూగుల్ మ్యాప్ తప్పుదారి చూపడంతో ఈ ప్రమాదం జరిగింది. గుడాటిపల్లి వద్ద నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్టులో(Gouravelli project) ఓ వ్యాన్ చిక్కుకోవడానికి కారణమైంది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాల ప్యాకెట్ కవర్ లోడ్‌తో హుస్నాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళుతూ, డ్రైవర్‌కు దారిపై సరైన అవగాహన లేకపోవడంతో స్మార్ట్ ఫోన్లో గూగుల్ రూట్ మ్యాప్ ఆధారంగా వ్యాన్‌ను నడిపారు.
నాగార్జునసాగర్‌కు 69 ఏళ్లు - నూతన వసంతంలోకి అడుగుపెట్టిన తెలుగింటి బంధం
Google Maps Gone Wrong at Siddipet : నందారం స్టేజి దాటిన తర్వాత సూటిగా రోడ్డు ఉందని గూగుల్ మ్యాప్(Google Maps) చూపగా, చీకట్లో వ్యాన్‌ను నడుపుతూ అలాగే వెళ్లారు. వానల వల్ల నిలిచిన నీరు అనుకుని ముందుకు వెళ్లగానే లోతు పెరిగింది. దీంతో వ్యాన్ క్యాబిన్లోకి నీళ్లు చేరి వాహనం నిలిచిపోయింది. గమనించిన డ్రైవర్... వ్యానులో ఉన్న ముగ్గురు మెల్లగా దిగి నీటిలో ఈదుకుంటూ సమీపంలోని జలు బాయ్ తండాకు వెళ్లారు. జరిగినదంతా వ్యాన్ డ్రైవర్ గ్రామస్థులకు తెలపగా వారు అవాక్కయ్యారు.
గ్రామస్థులే వ్యాన్‌కు తాళ్లు కట్టి జేసీబీ సహాయంతో వెనక్కి లాగడంతో అతి కష్టం మీద బయటకు వచ్చింది. నాలుగు నెలల క్రితం కూడా ఓ లారీని కూడా గూగుల్ రూట్ మ్యాప్ తప్పుదారి పట్టియడంతో ఇదే రీతిలో ప్రాజెక్ట్‌లోకి దూసుకెళ్లింది. అప్పుడు కూడా డ్రైవర్ అప్రమత్తతో ప్రాణాపాయం తప్పగా, గ్రామస్థులు జేసీబీ సహాయంతో లారీని బయటికి తీశారు.
Google Maps Mislead at Gouravelli Water Project : వాస్తవానికి నందారం స్టేజ్ వద్ద రోడ్డు స్టాపర్లను ఏర్పాటు చేసి వాహనాలను అక్కడి నుంచి బైపాస్ రోడ్డు ద్వారా దారి మళ్లించారు. కానీ స్టాపర్లు(Road Stopper) రోడ్డు పక్కన పడిపోయాయి, వాటి గురించి ఎవరూ పట్టించుకోలేదు. దీంతో వ్యాన్ ఆ దారిలో వెళ్లి నీటి ప్రాజెక్టులోకి దూసుకుపోయింది. ఇప్పటికైనా నందారం నుంచి ఉన్న దారిని పూర్తిగా మూసివేయాలని గ్రామస్థులు, స్థానికులు కోరుతున్నారు. లేకుంటే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశముందని వారు హెచ్చరిస్తున్నారు.
మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి - రెవెన్యూ గ్రామంగా అక్కంపేట
ఈసారైనా గ్రూప్-2 పరీక్ష షెడ్యూల్ ప్రకారం జరిగేనా - వచ్చే వారంలో క్లారిటీ