సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామలో దారుణం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో పవిత్ర (16) అనే ఓ బాలిక కాలిన గాయాలతో మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జాలిగామకు చెందిన బైరయ్య మమత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వాళ్లను తమ కిరాణ దుకాణంలో ఉంచి వ్యవసాయ పనులకు వెళ్లారు. పెద్ద కుమార్తె పవిత్ర (16) ఇంటి వెనకాల ఉన్న స్నానాల గది నుంచి కాలిన గాయాలతో అరుస్తూ బయటకు వచ్చింది.
గమనించిన స్థానికులు మంటలను ఆర్పివేసి, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు 80 శాతం కాలిన పవిత్రను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం పవిత్రను గాంధీ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'ప్రజాస్వామ్యంలో ప్రజల నోరు నొక్కడం సరికాదు'