సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ప్రముఖ న్యాయవాది టీవైఆర్ సేవా సంస్థ ప్రతినిధి రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత హోమియోపతి మందుల పంపిణీని ఫారెస్ట్ కార్పోరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు.
పేద ప్రజలంతా ఆరోగ్యవంతులుగా ఉండాలనే సంకల్పంతో ముందస్తు చర్యగా డెంగ్యూ, చికెన్గున్యా వ్యాధి నివారణ మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్న రాజును వంటేరు అభినందించారు. రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆరోగ్యమంతులుగా ఉండాలని ప్రతాపరెడ్డి కోరారు.
ఇదీ చూడండి: అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్గా వంటేరు బాధ్యతలు