ETV Bharat / state

కేసీఆర్​కి కృతజ్ఞతలు తెలుపుతూ... ట్రాక్టర్ ర్యాలీ చేసిన రైతులు - రైతుల ట్రాక్టర్ ర్యాలీ

కొత్త రెవెన్యూ చట్టం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ... ముఖ్యమంత్రి కేసీఆర్​కి కృతజ్ఞతలు తెలుపుతూ చిన్నకోడూర్ మండలంలో రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రం నుంచి పలు గ్రామాల మీదుగా ర్యాలీ చేశారు.

farmers-tractor-rayli-at-chinnakodur-in-siddipet-district-on-new-revenue-act
కేసీఆర్​కి కృతజ్ఞతలు తెలుపుతూ... ట్రాక్టర్ ర్యాలీ చేసిన రైతులు
author img

By

Published : Sep 22, 2020, 7:41 PM IST

సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూర్ మండలంలో కొత్త రెవెన్యూ చట్టం అమలు పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్​కి కృతజ్ఞతలు తెలియజేస్తూ... మండల కేంద్రం నుంచి పలు గ్రామాల మీదుగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా జడ్పీ ఛైర్మన్ రోజా ప్రారంభించారు.

ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పని చేస్తుందని రోజా అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రైతుల ఆర్థికంగా ఎదిగేందుకు కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావడం జరిగిందని వెల్లడించారు. అన్నదాతలు ఎన్నో భూమి సమస్యలు ఎదుర్కొన్నారని... కొత్త రెవెన్యూ చట్టంతో అవి పరిష్కారమవుతాయని జడ్పీ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: రెవెన్యూ చట్టాల గెజిట్ నోటిఫికేషన్ విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.