EX Minister Harish Rao Letter to Minister Uttam Kumar : సిద్దిపేట జిల్లా రైతాంగ సమస్యలు పరిష్కరించాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar)కి మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. గత మూడు సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లా భూములకు రంగనాయక సాగర్ ద్వారా సాగునీరు అందజేశామని, తద్వారా పంట దిగుబడి పెరిగి రైతుల బతుకుల్లో సంతోషం నిండిందని హరీశ్ రావు పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో అబద్ధాలు చెప్పినట్లే శాసనసభలోనూ చెప్పారు : హరీశ్‌రావు
Harish Rao Letter on Yasangi Water in Siddipet : ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో యాసంగి పంటకు సరిపోయే నీరు రిజర్వాయర్‌లో లేక రైతాంగం ఆందోళనకు గురవుతున్నారని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగికి నీళ్లు అందించాలంటే కనీసం మూడు టీఎంసీల నీరు ఉండాలని, కానీ ప్రస్తుతం రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లో 1.50 టీఎసీంసీల నీరు మాత్రమే ఉన్నాయని తెలిపారు.
రేషన్ బియ్యాన్ని 70శాతం కుటుంబాలు తినడం లేదు : ఉత్తమ్‌కుమార్ రెడ్డి
Harish Rao on Ranganayaka Sagar Water : రైతాంగ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని వెంటనే మిడ్ మానేరు(Harish Rao Demand Mid Maneru Water Release) నుంచి 1.50 టీఎంసీల నీళ్లు రంగనాయక సాగర్‌కు వచ్చే విధంగా పంపింగ్ చేసేలా ఇరిగేషన్ అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. గత మూడు సంవత్సరాలుగా అందించిన విధంగానే ఈసారి కూడా యాసంగి పంటకు కావాల్సిన సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీల అమలు దిశగా పోరాటం చేద్దాం : హరీశ్‌రావు