కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు వ్యతిరేకంగా.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్ కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. సహజ వనరులను ప్రైవేట్ పరం చేయవద్దని, విద్యుత్ సంస్థలను ప్రైవేట్ రంగానికి అప్పగించవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
ఉద్యోగుల నిరసన
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ అమెండ్ మెంట్ బిల్ 2020 ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి విద్యుత్ శాఖ ఉద్యోగులు నిరసన తెలిపారు. 327 సెక్రటరీ నవీన్ కుమార్,1104 ప్రెసిడెంట్ సుధాకర్, ఎస్సీ, ఎస్టీ డివిజన్ సెక్రటరీ శ్రీనివాస్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: జూన్ 2న తెలంగాణ డిమాండ్స్ డే: సీపీఐ కార్యదర్శి భూమన్న