వైజ్ఞానిక ప్రదర్శనలు పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేందుకు మంచి వేదికని హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 47వ జవహర్లాల్ నెహ్రూ సైన్స్, గణిత పర్యావరణ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలను ఆయన ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలు అందరినీ ఆలోచింపజేశాయి.
నిత్యం ఎదురయ్యే సమస్యల పరిష్కారంతో పాటు పర్యావరణ రక్షణ, కాలుష్య నియంత్రణ తదితర అంశాలపై విద్యార్థులు ప్రదర్శనలు చేశారు. జిల్లావ్యాప్తంగా 400 పైగా ప్రదర్శనలు వచ్చాయి. కార్యక్రమంలో జడ్పీ ఛైర్పర్సన్ రోజా శర్మ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువరన్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఖమ్మంలో 'బంగారు దొంగలు' అరెస్ట్