ETV Bharat / state

వేతనాలు చెల్లించాలంటూ డయాలసిస్​ ఉద్యోగుల ధర్నా

author img

By

Published : Jan 25, 2021, 7:07 PM IST

రెండు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదంటూ... సిద్దిపేట డయాలసిస్ సెంటర్​లో పనిచేసే డిమేడ్ కంపెనీకి చెందిన ఉద్యోగులు ధర్నా చేపట్టారు. జీతాలు లేక కుటుంబ పోషణ కష్టంగా ఉందని వాపోయారు.

Dialysis employees' dharna demanding payment of wages in siddipet district
వేతనాలు చెల్లించాలంటూ డయాలసిస్​ ఉద్యోగుల ధర్నా

రెండు నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదంటూ... సిద్దిపేట డయాలసిస్ సెంటర్​లో పనిచేసే ఉద్యోగులు ధర్నాకు దిగారు. 5గంటల పాటు డయాలసిస్​ సేవలను నిలిపివేశారు. డీమేడ్ కంపెనీకి చెందిన తాము సిద్దిపేట డయాలసిస్ సెంటర్​లో 3సంవత్సరాలుగా పని చేస్తున్నట్లు వారు తెలిపారు.

కాగా రెండు నెలలుగా జీతాలు చెల్లించడం లేదన్నారు. దీంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని వాపోయారు. తమ సమస్యలను పైఅధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకే ధర్నా చేపట్టినట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కేంద్రాల్లో ఉద్యోగులు నిరసన చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇది చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.