ETV Bharat / state

క్విట్ ఇండియా 'డే' సందర్భంగా కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించిన డీసీసీ - Quit India 'Day' latest News

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో క్విట్ ఇండియా డేను పురస్కరించుకుని డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించింది. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని జిల్లా కాంగ్రెస్ గుర్తుచేసింది.

క్విట్ ఇండియా 'డే' సందర్భంగా కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించిన డీసీసీ

author img

By

Published : Aug 9, 2020, 4:34 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ అంబేడ్కర్​ చౌరస్తాలో క్విట్ ఇండియా డే సందర్భంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. సంపూర్ణ స్వరాజ్యమే లక్ష్యంగా మహాత్మా గాంధీ ఇచ్చిన "డూ ఆర్ డై" ( మరణమో వీరస్వర్గమో ) అనే నినాదంతో ఆంగ్లేయులపై తెగబడి పోరాడిన ప్రతి స్వాతంత్ర్య సమరయోధుడికి డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి పాదాభివందనాలు చేస్తున్నామన్నారు.

కాంగ్రెస్​దే క్రియాశీలక పాత్ర...

దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక పాత్ర పోషించిందని లింగమూర్తి గుర్తు చేశారు. ఆనాటి స్వాతంత్య్ర ఉద్యమ నాయకుల త్యాగాలను ఆదర్శంగా తీసుకుని కాంగ్రెస్ కార్యకర్తలు, యువత ముందుకెళ్లాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కోమటి సత్యనారాయణ, మాజీ మార్కెట్ వైస్ ఛైర్మన్ ఎండీ.హసన్, కౌన్సిలర్లు భూక్య సరోజన, వల్లపు రాజు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : దక్షిణ తెలంగాణ ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉంది: చాడ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.