సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో ఆదివారం నుంచి మూడు రోజులు స్వచ్ఛంద లాక్డౌన్ ప్రకటించారు. ఈ వార్తను ప్రజలందరికి తెలిసేలా డప్పు చాటింపు వేయించారు. దండోరా వేసే వ్యక్తి వీధులన్నీ తిరుగుతూ 'పెద్దలందరూ కలిసి మూడు రోజుల పాటు లాక్డౌన్ విధించాలని తీర్మానం చేశారు, కాబట్టి ఇంటి నుంచి ఎవ్వరు బయటకు రాకూడదు, దీనికి అందరూ కట్టుబడి ఉండాలి' అంటూ ప్రజలందరికీ తెలియజేశాడు.
ఆదివారం నుంచి లాక్డౌన్ అంటూ గ్రామంలో దండోరా - సిద్దిపేట జిల్లా వార్తలు
దండోరా... ఒకప్పుడు గ్రామాల్లో చాలా ప్రాచుర్యం పొందిన ఆచారం. ఊర్లో ఏం జరిగినా దండోరా వేసే ప్రజలకు తెలియజేసేవారు. కాలం గుడుస్తున్న కొద్ది డప్పు చాటింపు కనుమరుగైంది. లాక్డౌన్ పుణ్యమా అని ఈ మధ్య కొన్ని గ్రామాల్లో ఈ డప్పు చాటింపు వేసేవారు కనిపిస్తున్నారు. ఆదివారం నుంచి లాక్డౌన్ అంటూ మిరుదొడ్డిలో దండోరా వేయించారు.
ఆదివారం నుంచి లాక్డౌన్ అంటూ గ్రామంలో దండోరా