సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో కాంగ్రెస్ నాయకులు రైతు సంక్షేమ దీక్ష చేపట్టారు. టీపీసీసీ కార్యదర్శి బొమ్మ శ్రీరాం చక్రవర్తి దీక్షలో పాల్గొన్నారు. పంటల సేకరణ, వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. తాలు పేరుతో క్వింటాకు 6 నుంచి 8 కిలోల ధాన్యాన్ని తరుగు తీస్తున్నారని చెప్పారు. ప్రకృతి వైపరిత్యాలతో నష్టపోయిన పంటలకు వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: ప్రతి ఉత్పత్తిపై ఓరియంటల్ ఇన్సూరెన్స్: నిరంజన్ రెడ్డి