సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని ఇటిక్యాల కొత్తపేట లింగారెడ్డిపల్లి గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమస్యల పరిష్కార పురోగతిపై జిల్లా కలెక్టర్... గద్వాల్ ఆర్డీవో కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. సీఎం ఆదేశాలతో ఆయా గ్రామాల్లో శాశ్వతంగా భూ సమస్య పరిష్కరించేందుకు గత 20 రోజులుగా నలుగురు తహసీల్దార్లు, 6 సర్వేయర్లు క్షేత్ర స్థాయిలో నిర్వహించిన సర్వే పూర్తయిందన్నారు.
సర్వే వివరాలు ఏర్పాటు...
ఇప్పటికే సర్వే వివరాలను గ్రామ పంచాయతీ కార్యాలయంతో పాటు తహసీల్దార్, ఆర్టీవో కార్యాలయంలో ఏర్పాటు చేశామన్నారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరించి క్షేత్ర స్థాయిలో విచారించి పకడ్బందీగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు రైతులందరికీ న్యాయం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో భూ సమస్య రాకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.