సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ లాక్డౌన్ అమలుతీరును పరిశీలించారు. అలాగే పట్టణ శివారులో పోలీసులు ఏర్పాటు చేసిన పికెట్లను సందర్శించారు. పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, పాసులు లేకుండా వెళ్లే వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేయాలని సీపీ సూచించారు. లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాలన్నారు.
ప్రజా ప్రతినిధులు, వ్యాపారులు పోలీసులకు సహకరించాలని కోరారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని... ఒకవేళ వచ్చినా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని సీపీ జోయల్ డేవిస్ సూచించారు. హుస్నాబాద్ డివిజన్ పరిధిలో ఈనెల 12వ తేదీ నుంచి నేటి వరకు కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన 422 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే ఈనెల 21వ తేదీ నుంచి ఈరోజు వరకు 45 వాహనాలు సీజ్ చేశామని ఎస్పీ మహేందర్ అన్నారు.
ఇదీ చదవండి : ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం వాయిదా