సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ధరణి పోర్టల్ ద్వారా ప్రయోగాత్మకంగా చేపట్టిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ టెస్టింగ్‌ను పరిశీలించారు. ఈ మేరకు తహసీల్దార్ ఆరీఫాకు, కంప్యూటర్ ఆపరేటర్‌కు ధరణి పోర్టల్ అంశంపై పలు సూచనలు చేశారు. క్రయ, విక్రయాలకు సంబంధించి అప్లోడ్ చేస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకుని, రిజిస్ట్రేషన్ జరిపే టెస్టింగ్ తీరును స్వయంగా పరిశీలించారు.
రైతులకు అనుకూలంగా ప్రతి మండలంలో ధరణి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. ధరణి రిజిస్ట్రేషన్ ప్రక్రియపై అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో గజ్వేల్ ఆర్డీవో విజయేందర్ రెడ్డి, తహసీల్దార్ ఆరీఫా, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మర్కూక్ మండలంలోని ముఖ్యమంత్రి దత్తత గ్రామం ఎర్రవల్లిలో నిర్మిస్తున్న రైతు వేదికను పరిశీలించారు. రైతు వేదిక నిర్మాణం తుది దశకు చేరుకోవడంతో అధికారులతో మాట్లాడారు. చుట్టూ పచ్చదనం సంతరించుకునేలా మొక్కలు నాటించాలని సూచించారు.
ఇదీ చూడండి.. ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బోటు పర్యటన