సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం, మోతెలో సీఎం కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పర్యటించారు. వైకుంఠ ధామాలు, డంప్ యార్డులు, నర్సరీలు, చెట్ల పెంపకంను పరిశీలించారు. మోతెలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పనులు ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు.
గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత ఉంటేనే అనారోగ్యం దరిచేరదన్నారు. గ్రామస్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రభుత్వం అందించే నిధులను ఉపయోగించుకుని పచ్చదనం, పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రతీ ఒక్కరు చెట్లను నాటాలని అన్నారు.
ఇవీ చూడండి: రుణాలు సేకరించి ప్రాజెక్టులు కట్టాం.. నిధులివ్వండి: హరీశ్