ETV Bharat / state

చింతలేని చింతమడకను తయారు చేస్తా..

చింతమడకను ఏ చింత లేని గ్రామంగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధికి కావల్సిన రూ.200 కోట్ల నిధులకు సంబంధించిన జీవోలను రెండు రోజుల్లో జారీ చేస్తామని తెలిపారు. గ్రామంలో కలియ తిరుగుతూ.. మిత్రుల్ని, గ్రామస్థులను పేరుపేరునా పలకరించారు. స్థానిక ఆలయాల్లో పూజలు చేశారు.

author img

By

Published : Jul 22, 2019, 9:37 PM IST

Updated : Jul 23, 2019, 3:57 PM IST

చింతలేని చింతమడక

సొంత ఊళ్లో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామంపై వరాల వర్షం కురిపించారు. సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామస్థులతో సీఎం ఆత్మీయ అనురాగ సమ్మేళనంలో పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి కోసం రూ.200 కోట్ల నిధులకు సంబంధించిన జీవోలను రెండు రోజుల్లో జారీ చేస్తామని హామీ ఇచ్చారు.

చింతమడకలో కేసీఆర్
ఈ స్థాయికి చేరేలా చేసినందుకు వందనం..

ఉదయం సొంత గ్రామం చింతమడకకు చేరుకున్న సీఎం కేసీఆర్​కు అధికారులు, గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. తొలుత ఊళ్లోని శివాలయం, రామాలయం, గ్రామదేవతలకు ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్థులను ఆప్యాయంగా పలకరించారు. తనకు జన్మనిచ్చి... పెంచి ఈ స్థాయికి చేరేలా చేసిన చింతమడక గ్రామంలో ప్రజలకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేశారు.

వరాల జల్లు..

చింతమడకలోని ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు లబ్ధి పొందే పథకానికి శ్రీకారం చుడతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వీటి మొత్తం విలువ రూ.200 కోట్లు ఉంటుందని వివరించారు. వాటిని వెంటనే మంజూరు చేస్తానని హమీ ఇచ్చారు. గ్రామంలో ఉన్న 2వేల కుటుంబాలు బాగుపడాలని ఆకాంక్షించారు. వలస వెళ్లినవారిని కూడా రప్పించి హామీలు అందేలా చూడాలన్నారు. చింతమడక నుంచి విడిపోయి నూతన పంచాయతీలుగా ఏర్పడిన గ్రామాలకూ ఈ లబ్ధి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

"ఎవ్వడేం సక్కగా లేడు. అందరూ అప్పుల పాలై ఉన్నారు నాకు తెలుసు ఆ సంగతి. వాళ్లు ఏం కోరితే అది.. వాళ్లు ఏం చేస్తే అది. మీకు 1500 నుంచి 2వేల ఇళ్లు మంజూరు చేస్తున్నా. మంచిగ కట్టండి. కార్తీకమాసంలోపు కొత్త ఇళ్లకు పోయే పండుగ చేయాలే!"

------- సభలో కేసీఆర్

సిద్దిపేటకు త్వరలో రైలు..

గ్రామంలో ఉచిత కంటి శిబిరం ఏర్పాటు చేయాలని హరీశ్‌రావుకు ముఖ్యమంత్రి సూచించారు. వలస వెళ్లిన వారిని కూడా పిలిచి పథకాలు అందేలా చూడాలన్నారు. చింతమడకలో 4 నెలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. త్వరలో సిద్దిపేటకు రైలు వస్తుందని హామీ ఇచ్చారు. సిద్దిపేటకు అందించిన మంచినీటి పథకం స్ఫూర్తితోనే మిషన్‌ భగీరథకు రూపకల్పన చేసినట్లు సీఎం పేర్కొన్నారు. చింతమడకలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. బీసీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి శంకుస్థాపన చేశారు. కావేరి సీడ్స్ ఆధ్వర్వంలో నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో కేసీఆర్ మొక్క నాటారు.

వీధి వీధి తిరిగిన కేసీఆర్..

గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాదయాత్ర చేశారు. వీధి వీధి కలియతిరుగుతూ చిన్ననాటి మిత్రుల్ని.. గ్రామస్థులను పేరుపేరునా పలకరించారు. పాదయాత్ర మధ్యలో సీఎంతో స్వీయ చిత్రాలు తీసుకునేందుకు యువత పోటీపడ్డారు. ప్రతి ఇంటి వద్ద ఆగి అందరినీ పలకరించారు. గ్రామస్థుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సీఎంతో కరచాలనానికి స్థానికులు ఎగబడ్డారు.

గురువు ఇంటి సందర్శన..

తన గురువు వెంకటరెడ్డి ఇంటిని కేసీఆర్ సందర్శించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారం చూపారు. స్థానిక శివాలయంలో పూజలు చేశారు. నిర్మాణంలో ఉన్న రామాలయం పనులను సీఎం పరిశీలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.

ఇవీ చూడండి: కేటీఆర్​ పుట్టిరోజు కానుకగా గిఫ్ట్​స్మైల్​ ఛాలెంజ్​

Last Updated : Jul 23, 2019, 3:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.