ETV Bharat / state

Cm Kcr: నా కళ్లల్లో ఆనంద భాష్పాలు వస్తున్నాయ్..

తెలంగాణ రాక ముందు తాగునీరు, విద్యుత్ ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) గుర్తు చేశారు. రాష్ట్రం సిద్దించిన తర్వాత అన్నింటిని చక్కబెట్టుకున్నట్లు వివరించారు. దేనికోసమైతే రాష్ట్రం సాధించుకున్నామో వాటిని సాకారం చేసుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ (Cm Kcr) పేర్కొన్నారు.

Cm
సీఎం కేసీఆర్
author img

By

Published : Jun 20, 2021, 4:25 PM IST

Cm Kcr: మనసుతోటి చెబుతున్న కళ్లల్లో ఆనంద భాష్పాలు వస్తున్నయి

గతంలో మంచినీటి కోసం కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సీఎం కేసీఆర్ (Cm Kcr) తెలిపారు. గతంలో తాగు, సాగునీటి కోసం సిద్దిపేట ప్రజలు ఎంతో గోస పడ్డారని గుర్తుచేశారు. ప్రస్తుతం చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. మే నెలలో కూడా చెరువులు అలుగు పారుతున్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సబ్‌స్టేషన్‌ కోసం ఎంతో శ్రమించాల్సి వచ్చేదని ఆనాటి రోజులను ప్రసంగంలో చెప్పుకొచ్చారు.

ప్రజలకు మేలు చేసేలా నిర్ణయాలు ఉండాలని సీఎం కేసీఆర్ (Cm Kcr) మరోమారు పేర్కొన్నారు. ఒక్క తప్పటడుగు వేస్తే కొన్ని తరాలు నష్టపోతాయని హెచ్చరించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ప్రాధాన్యతగా విద్యుత్ సమస్యను పరిష్కరించినట్లు సీఎం స్పష్టం చేశారు.

విద్యుత్ సమస్యను మొదటి ప్రాధాన్యతగా పరిష్కరించుకున్నం. ఇప్పుడు ఎక్కడ మోటారు కాలదు. ఆ మోటార్ రీపేర్ చేసే దుకాణాదారులు దివాళ తీసిన పరిస్థితి వచ్చింది. వాళ్లు వచ్చి నన్ను అడుగుతున్నరు మా సంగతి ఏందని? కరెంట్​లో మనం ఏం బాధలు అనుభవించామో అందరి కంటే ఎక్కువ సిద్దిపేట ప్రజలకు తెలుసు.

--- ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణలో ఈ ఏడాది 3 కోట్ల టన్నుల వరి ధాన్యం పండిందని సీఎం కేసీఆర్ (Cm Kcr)తెలిపారు. ఇప్పటివరకు ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌ తొలిస్థానంలో ఉండేదని... తెలంగాణ వారిని అధిగమించినట్లు హర్షం వక్తం చేశారు.

మనసుతోటి చెబుతున్న... నేను పుట్టిన గడ్డ కాబట్టి కళ్లల్లో ఆనంద భాష్పాలు వచ్చే పరిస్థితి. ఇయ్యాళ తెలంగాణలో మూడు కోట్ల టన్నుల వడ్లు పండినయి. దేశానికి అగ్రగామిగా ఉన్న రాష్ట్రం పంజాబ్. వాళ్ల దగ్గర పండేది 2 కోట్ల 2 లక్షల టన్నుల వడ్లు మాత్రమే. కానీ తెలంగాణలో 3 కోట్ల టన్నుల వడ్లు పండుతున్నాయి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకే కోటి 40 లక్షల వడ్లు జోకినం.

--- ముఖ్యమంత్రి కేసీఆర్

ఇదీ చదవండి: CM KCR : సిద్దిపేటలో ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభించిన సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.