ETV Bharat / state

సిద్దిపేట జిల్లాలో దొంగల బీభత్సం

సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని పలు గ్రామాల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు.

సిద్దిపేట జిల్లాలో దొంగల బీభత్సం
author img

By

Published : Nov 9, 2019, 5:36 PM IST

సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని గుడికందుల, గోవర్ధనగిరి గ్రామాల్లో నిన్న అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు గ్రామాల్లోని తాళం వేసి ఉన్న 8 ఇంళ్లల్లో చోరీకి పాల్పడ్డారు.

పెళ్లి ఉందని కుటుంబ సమేతంగా సిద్దిపేట వెళ్లామని ఇంట్లో దొంగలు పడ్డారని ఫోన్ చేయగా వచ్చి చూశానని... తులం బంగారం, 18 వేల నగదు పోయిందని బాధితుడు నర్సింహారెడ్డి వాపోయాడు. తాను వ్యవసాయం చేసుకుని బ్రతుకుతానని.. పంట పెట్టుబడి కోసం డబ్బులు ఇంట్లో పెట్టి వెళ్తే ఇలా జరిగిందని పోలీసులు ఎలాగైనా దొంగలను పట్టుకుని తనకు న్యాయం చేయాలని రైతు కోరాడు.

4 ఇళ్లల్లో 16 వేల నగదు.. 4 తులాల బంగారం పోయిందని మిగతా నాలుగు ఇళ్లల్లో తాళాలు పగులకొట్టి చూసి వెళ్లారని, సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా దొంగలను గుర్తిస్తామని మిరుదొడ్డి ఎస్సై శ్రీనివాస్​ అన్నారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే 100కి డయల్​ చేయాలని అన్నారు.

సిద్దిపేట జిల్లాలో దొంగల బీభత్సం

ఇదీ చూడండి: వెలుగులోకి నయా దందా... ఇదో కొత్త పెళ్లిగోల

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.