ఇటీవల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌ను ఖండిస్తూ.. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కేంద్రం ఇచ్చే నిధులు 23 పథకాల ద్వారా నేరుగా ప్రజలకు చేరుతున్నాయని.. ఆ విషయం ప్రజలందరికీ తెలుసునని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి స్పష్టం చేశారు.
హరీశ్‌రావు కేంద్రం నుంచి నయా పైసా రాలేదని పదేపదే బుకాయించడం అబద్ధమనే సంగతి ప్రజలకు తెలిసిందన్నారు. పోలీసులు అత్యుత్సాహంతో బండి సంజయ్‌ను అరెస్ట్ చేస్తే.. అది తట్టుకోలేని కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని చెప్పారు.
ఇదీ చూడండి: 'దుబ్బాకలో పెద్దఎత్తున డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు'