సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ఊరువాడ అన్న తేడా లేకుండా ప్రతి వాడవాడలో బతుకమ్మ సందడి నెలకొంది. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు బతుకమ్మ పండుగను పిల్లలు ఘనంగా నిర్వహించారు.
రంగురంగుల పూలతో తయారు చేసిన బతుకమ్మను గ్రామ ప్రధాన వీధుల్లో ఉంచి దాని చుట్టూ లయబద్దంగా తిరుగుతూ పాటలు పాడారు. సాయంత్రం వేళల్లో బతుకమ్మలతో మహిళలు సందడి చేశారు. అనంతరం బతుకమ్మలను గ్రామ శివారులో ఉన్న చెరువులో నిమజ్జనం చేశారు.
ఇదీ చూడండి: రెండోరోజు అన్నపూర్ణగా శ్రీ భద్రకాళి అమ్మవారి దర్శనం