రాష్ట్రంలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నవారిపై పోలీసులు కొరడా ఝులిపించారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం శ్రీరాంపూర్‌లో భారీగా నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి....సుమారు రూ. 5కోట్ల విలువైన 2వేల 384 కిలోల విత్తనాలను సీజ్ చేశారు. నిందితులను అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు.
నకిలీ విత్తనాల రవాణాను నిలువరించేందుకు... జిల్లా, మండల స్థాయిల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. ఎక్కడ నకిలీ విత్తనాల జాడ కనిపించినా పోలీసులకు ఫిర్యాదు చేయాలని రైతులకు సూచించారు.
ఇదీ చదవండి: Cyber Crime: మాటలతో ఎరవేసి.. ఆన్‌లైన్‌లో దోచేసి!