సిద్దిపేట డిపో నుంచి పోలీసుల సమక్షంలో ఆర్టీసీ బస్సులు బయలుదేరాయి. బంద్‌కు పిలుపునిచ్చినా బస్సు బయటికి తీశాడని ఆర్టీసీ కార్మికులు తాత్కాలిక డ్రైవర్‌పై దాడి చేశారు. ఓ వైపు తాము సమ్మె చేస్తుంటే మరో వైపు మీరు బస్సులను ఎలా నడుపుతారంటూ విరుచుకుపడ్డారు. అతని చొక్కా చింపి చెప్పుతో కొట్టారు. రంగప్రవేశం చేసిన పోలీసులు తాత్కాలిక డ్రైవర్ని కాపాడారు. బస్సును తిరిగి డిపోకు తరలించారు.
ఇవీ చూడండి: సాయంత్రం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం: ఆర్టీసీ ఐకాస