విత్‌డ్రా చేయాలనుకున్న మొత్తానికి సమానమై నగదు.. ఎక్కువ వస్తుండటంతో ఓ ఏటీఎం కేంద్రానికి వినియోగదారులు ఎగబడ్డారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు బ్యాంకు ఏటీఎం కేంద్రంలో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఇవాళ ఓ వ్యక్తి ఈ ఏటీఎంలో రూ.1000 విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించారు. అయితే.. రూ.1000కి బదులు.. రూ.2000 రావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు! మరోసారి అదే విధంగా చేయగా.. మళ్లీ రూ.2,000 వచ్చాయి. దీంతో స్థానికంగా ఈ విషయం ఒక్కసారిగా దావానలంలా వ్యాపించింది.
వెంటనే నగదు ఉపసంహరణ కోసం స్థానికులు పెద్దఎత్తున ఏటీఎం వద్ద గుమిగూడారు. ఈ క్రమంలోనే బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకుని ఏటీఎం కేంద్రాన్ని మూసివేశారు. మరోవైపు బ్యాంకు అధికారులు.. ఎవరెవరు ఎంతమొత్తంలో నగదు తీసుకున్నారో ఆరా తీసే పనిలో పడ్డారు.
ఇవీ చదవండి: