సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఆర్యవైశ్య యువజన సంఘం, రెడ్ క్రాస్ సొసైటీల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సుమారు 50 మంది పాల్గొని రక్తం దానం చేశారు.
అత్యవసర పరిస్థితుల్లో అవసరం ఉన్నవారు సంప్రదిస్తే రక్తాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఆర్యవైశ్య యువజన అధ్యక్షుడు నిర్మల సంతోష్ తెలిపారు. కార్యక్రమానికి తితిదే పాలక మండలి సభ్యులు మోరం శెట్టి రాములు హాజరయ్యారు.
రక్తదానం చేసిన యువకులను అభినందించి వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘ ప్రధాన కార్యదర్శి సాగర్, సందీప్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మహమ్మారి విరుచుకుపడ్డా నిలదొక్కుకుంటున్నాం: హరీశ్