ETV Bharat / state

మినీ పోల్స్​: పోలింగ్​కు సర్వం సన్నద్ధమైన సిద్దిపేట - సిద్దిపేట మున్సిపల్​ ఎన్నికలు

సిద్దిపేట పురపాలక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. కరోనా నేపథ్యంలో పోలింగ్​ కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ మాస్కు, ఫేస్​షీల్డ్, శానిటైజర్ అందించారు. ఓటర్లుకు కూాడా మాస్క్ తప్పనిసరి చేశారు.

siddipeta
సిద్దిపేట
author img

By

Published : Apr 29, 2021, 9:52 PM IST

సిద్దిపేట బల్దియా ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 43వార్డులకు గానూ... 236 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 130 పోలింగ్ కేంద్రాల్లో 10,0678 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2,388 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. కరోనా నేపథ్యంలో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఒక పోలింగ్ కేంద్రంలో 800 మంది ఓటర్లకు మించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. పోలింగ్ కేంద్రాలను శానిటైజ్ చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ మాస్కు, ఫేస్ షీల్డ్ ధరించేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఓటర్లకు సైతం మాస్క్ తప్పనిసరి చేశారు. మాస్క్ లేకుండా వచ్చే వారికి జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రానికి వచ్చిన ప్రతి ఓటర్ శరీర ఉష్ణోగ్రత్తలు పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతించనున్నారు.

500మంది పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. డివిజన్​లో 32 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనంగా బలగాలను మోహరించారు. వెబ్ కాస్టింగ్ సైతం నిర్వహిస్తున్నారు. వీటితో పాటు స్ట్రైకింగ్ ఫోర్సును కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఎన్నికలు ముగిసిన తర్వాత 72 గంటల వరకూ పోలీసుల నిఘా కొనసాగుతుందని సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ తెలిపారు.

సిద్దిపేటతో పాటు గజ్వేల్​లోని 12 వార్డుకు సైతం ఉపఎన్నిక జరుగుతోంది. ఇటు ఎండ తీవ్రత, అటు కొవిడ్​ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.

ఇదీ చూడండి: మినీ పురపోరుకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.