సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గంగారంలో అక్రమ మద్యం అమ్మకాలపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు దుకాణాల్లోని మద్యం సీసాలను ధ్వంసం చేశారు. గ్రామంలో మద్యం అమ్మకాలు చేపట్టవద్దని తీర్మానాలు చేసినా.... కొందరు దుకాణాలు నడపుతున్నారని ఆరోపించారు.
అక్రమంగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల.... యువత బానిసలు అవుతున్నారని వాపోయారు. ఇవాళ మహిళలంతా కలిసి మద్యం విక్రయిస్తున్న దుకాణాలపై దాడి చేసి సీసాలను పగలగొట్టారు. దుకాణదారుల తీరు మారకపోతే ఊరుకోమని హెచ్చరించారు.
ఇదీ చదవండి: భర్తను హత్య చేసి ఇంట్లో పూడ్చిపెట్టిన భార్య