ప్రజలే బాసులు..
తెరాస ఎవరికీ బీ టీమ్ కాదని.. ప్రజలే తమకు బాసులని అల్లదుర్గం సభలో ముఖ్యమంత్రి ఘాటుగా స్పందించారు. దేశ గతిని మార్చే అజెండాను రూపొందిస్తుందన్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని పథకాలు దేశం మొత్తం అమలు కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. 16 మంది ఎంపీలను గెలిపిస్తే దేశ రాజకీయాల్లో కారు... టాప్ గేర్‌లో ఉంటుందని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ తప్పక నెరవేరుస్తామన్నారు. రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్తు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం ఉద్ఘాటించారు.
70 ఏళ్లుగా ఏం చేశారు..?
70 ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్, బాజపా పరస్పరం తిట్టుకుంటున్నాయని మెదక్ జిల్లా నర్సాపూర్‌లో గులాబీ బాస్ విమర్శించారు. ఇందిరాగాంధీ ఇచ్చిన గరీబీ హఠావో నినాదాన్ని ఆమె మనవడు రాహల్ గాంధీ చెప్తున్నారని ఎద్దేవా చేశారు. న్యాయ్ పథకంతో పేదరికం పోగొడతానని రాహుల్ అంటున్నారని... దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ ఎందుకు తగ్గించలేదని కేసీఆర్ దుయ్యబట్టారు. హస్తం, కమలం పార్టీల బాధ్యతారాహిత్యం వల్లే బీదరికం పోలేదని ఆరోపించారు. మెదక్ జిల్లాలో 12 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని భరోసా ఇచ్చారు.
ప్రగతికాముక దేశ నిర్మాణంలో తెలంగాణ, తెరాస ముఖ్య పాత్ర పోషించాలని నర్సాపూర్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు.
ఇవీ చూడండి:రాహుల్, మోదీ ఇన్నేళ్ల నుంచి ఎందుకు పోగొట్టలేదు