ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ సువర్ణ షెట్కార్. ఆమె కుమారుడు అభిషేక్ షెట్కార్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి సుమారు 400 కుటుంబాలకు సరకులు అందించారు. లాక్‌డౌన్ కాలంలో పలు దఫాలుగా పట్టణంలో పేదలకు చేయూత అందిస్తూ... దాతృత్వం చాటుతున్నారు.
ఇదీ చూడండి: 'కరోనాకు ముందు జాగ్రత్తే మందు..'