సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పెద్దాపూర్ శివారులోని 65వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు..ముందున్న లారీని బలంగా ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ సురేందర్ రెడ్డి తెలిపారు.
ఇవీ చూడండి : నడిరోడ్డు మీద పోలీసుపై దుండగుల దాడి