ETV Bharat / state

పిడుగు పడి ఇద్దరు మృతి - పిడుగుపాటు

సంగారెడ్డి జిల్లా కల్హేర్​ మండలంలోని వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపడి ఇద్దరు మృతి చెందారు. మండలంలోని పొమ్యానాయక్​ తండాకు చెందిన సుదర్శన్​ అనే పదోతరగతి విద్యార్థి చనిపోగా... అదే మండలంలోని నాగధర్​ మెుదళ్ల కుంటకు చెందిన రవీందర్​ అనే రైతు చనిపోయాడు.

two killed in lightning strike in sangareddy district
పిడుగు పడి ఇద్దరు మృతి
author img

By

Published : May 15, 2020, 9:02 PM IST

సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో పిడుగు పాటుకు ఇద్దరు మృతి చెందారు. కల్హేర్​ మండలంలోని పొమ్యా నాయక్ తండా శివారులో పిడుగు పాటు వల్ల పదోతరగతి విద్యార్థి సుదర్శన్ ప్రాణాలు కోల్పోయాడు. తండాకు చెందిన లచ్చు నాయక్ కుమారుడు సుదర్శన్ పదో తరగతి చదువుతున్నాడు. లాక్ డౌన్​ వల్ల ఇంట్లోనే ఉంటున్నాడు. అప్పుడప్పుడు తండ్రికి తోడుగా పొలం పనులకు వెళ్లేవాడు. ఎప్పటి లాగానే పొలం పనులకు వెళ్లారు. సాయంత్రం ఉరుములు, మెరుపులతో వర్షం పడుతోందని సుదర్శన్​ ఓ చెట్టు కిందకు వెళ్లాడు. అదే సమయంలో పిడుగు పడడం వల్ల సుదర్శన్ మృతి చెందాడు.

మరో ఘటనలో అదే మండలం నాగధర్​ మొదళ్ల కుంటకు చెందిన రవీందర్ అనే రైతు పొలంలో పనిచేసుకుంటుంగా పిడుగు పడి చనిపోయాడు.

ఇవీ చూడండి: భార్య ఇంటికి రావడం లేదని భర్త ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.