ETV Bharat / state

నీటికుంటలో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి - Sangareddy District Latest News

two-children-drowned-in-a-puddle at sangareddy district
నీటికుంటలో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి
author img

By

Published : Aug 9, 2020, 5:35 PM IST

Updated : Aug 9, 2020, 7:06 PM IST

17:33 August 09

నీటికుంటలో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి

నీటికుంటలో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి

ఈత సరదా ప్రాణాల మీదకు తెచ్చింది. దోస్తులతో కలిసి వ్యవసాయ క్షేత్రంలో నీటి కుంటలోకి ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం పొట్​పల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బర్దిపూర్​కు చెందిన పదకొండేళ్ల విశాల్ బాబు, పదేళ్ల హర్షవర్ధన్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లారు. నీటికుంట లోతు ఎక్కువగా ఉండడం వల్ల విశాల్ బాబు, హర్షవర్ధన్ నీట మునిగారు. పక్కనే ఉన్న ఇద్దరు స్నేహితులు గుర్తించి గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. 

ఘటన స్థలానికి చేరుకున్న జహీరాబాద్ గ్రామీణ పోలీసులు ఈతగాళ్ల సాయంతో చిన్నారుల మృతదేహాలను బయటికి తీశారు. మృతి చెందిన ఇద్దరు చిన్నారులు ఐదు, ఆరో తరగతి చదువుతున్నట్టు తెలిసింది. ఈ ఘటనతో బర్దిపూర్ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాలను ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : ఆ విషయంలో సీఎంను ప్రశ్నించిన ఎంపీ రేవంత్​ రెడ్డి

Last Updated : Aug 9, 2020, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.