ETV Bharat / state

'కార్మిక వ్యతిరేక వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు'

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ మండలం బీరంగూడ మార్కెట్ వద్ద నందమూరి తారకరామారావు విగ్రహాన్ని తెతెదేపా అధ్యక్షుడు ఎల్​. రమణ ఆవిష్కరించారు.

'కార్మిక వ్యతిరేక వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు
author img

By

Published : Nov 25, 2019, 5:22 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని తెతెదేపా అధ్యక్షుడు ఎల్​. రమణ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ మండలం బీరంగూడ మార్కెట్ వద్ద తెదేపా తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు ఎడ్ల రమేశ్​ ఏర్పాటు చేసిన నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఆర్టీసీని పరిరక్షించాల్సిన ముఖ్యమంత్రి.. కార్మికులపై కన్నెర్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎలాంటి షరతులు లేకుండా చేరుతామని కార్మికులు చెబుతుంటే చేర్చుకునే ఆలోచన కూడా ముఖ్యమంత్రి చేయడం లేదని మండిపడ్డారు. కార్మికుల పట్ల వ్యతిరేకత భావన ఉన్న వ్యక్తిగా సీఎం చరిత్రలో నిలిచిపోతారన్నారు.

ఎన్​టీఆర్ విగ్రహావిష్కరణించిన ఎల్ రమణ

ఇవీచూడండి: 'మానవ వనరుల అభివృద్ధి కోసమే ఇరిఫెం

Intro:hyd_tg_09_25_NTR_statu_open_ramana_VO_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నాయని రాష్ట్ర తెదేపా అధ్యక్షులు ఎల్.రమణ ఆరోపించారు
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ సోమవారం మార్కెట్ వద్ద తెదేపా తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు ఎడ్ల రమేష్ ఏర్పాటుచేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఎల్.రమణ ఆరోపించారు ఆర్టీసీని పరిరక్షించాల్సిన ముఖ్యమంత్రి కన్నెర్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆర్టీసీకి ఇచ్చే రాయితీలు ప్రభుత్వమే చెల్లించాలని అలాగే వారి జీతభత్యాల తో భారం పడే సమయంలో ప్రభుత్వమే భరించాలి అన్నారు ఆర్టీసీ కార్మికులను ఇబ్బందులపాలు చేస్తున్నారని ఎటువంటి షరతులు లేకుండా చేరుతామని చెబుతుంటే చేర్చుకునే ఆలోచన కూడా ముఖ్యమంత్రి చేయడం లేదన్నారు కార్మికుల పట్ల వ్యతిరేకత భావన ఉన్న వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారని ఆయన తెలిపారు ఆర్టీసీ కార్మికుల పై ఉక్కుపాదం మోపడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అని చెప్పారు మిగులు బడ్జెట్ అని చెప్పిన తెలంగాణలో బాధలు పడి ప్రాణాలు కోల్పోవడం కెసిఆర్ అసమర్థతకు నిదర్శనమన్నారు ఈ సమస్యను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని అలాగే కేంద్ర ప్రభుత్వం అవసరం అయితే రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లి కార్మికుల న్యాయమైన కోరికలు తీర్చాలా చూడాలని కోరతామని అని తెలిపారు ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తే కార్మికులకు అన్యాయమే కాక రాష్ట్ర ప్రజలకు పెను భారం అవుతుందని తెలిపారు

Conclusion:బైట్ ఎల్. రమణ రాష్ట్ర తెదేపా అధ్యక్షులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.