సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని ఓ ఇంట్లో... ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టిన దుండగులు పెద్ద ఎత్తున నగదు దోచుకెళ్లారు. ఎల్ఐజీ క్వార్టర్ నెంబర్ 162లో సత్యనారాయణ అనే వ్యక్తి అద్దెకు ఉంటున్నాడు. లాక్డౌన్ సడలింపు నేపథ్యంలో ఏపీలోని తన స్వగ్రామమైన రాజోలుకు కుటుంబంతో కలిసి వెళ్లాడు.
ఇదే అదనుగా భావించిన దుండగలు అర్థరాత్రి సమయంలో నెంబర్లేని ద్విచక్రవాహనంపై వచ్చి ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని 6.8లక్షల నగదును దొంగలించారు. బంగారం కూడా పోయింది అనుకున్నప్పటికీ.. వెతకగా దొరికిందని పోలీసులు తెలిపారు. దొంగలు బైక్పై వచ్చి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలలో నిక్షిప్తమయ్యాయి.
ఇవీ చూడండి: 'బోరు'న పొంగిన దుఃఖం.. బాలుడి కథ విషాదాంతం