ETV Bharat / state

'సమాజాన్ని కేంద్రం పీల్చి పిప్పి చేస్తోంది' - Sangareddy District Latest News

తెలంగాణ డెమోక్రటిక్ ఫోరమ్​ ఆధ్వర్యంలో సంగారెడ్డి కేంద్రంలో జిల్లా సదస్సు నిర్వహించారు. రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. రద్దు చేయకుంటే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

The district conference of the Telangana Democratic Forum
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ డెమోక్రటిక్ ఫోరమ్ సదస్సు
author img

By

Published : Mar 6, 2021, 3:40 PM IST

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు అప్పగిస్తూ సమాజాన్ని కేంద్ర ప్రభుత్వం పీల్చిపిప్పి చేస్తోందని తెలంగాణ డెమోక్రటిక్ ఫోరమ్ నేతలు విమర్శించారు. పేదవారి ఖాతాలో 15 లక్షలు వేస్తామన్న హామీ మరిచిందని ఆరోపించారు. ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలిస్తామని మాట తప్పిందని మండిపడ్డారు.

రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ సంగారెడ్డి కేంద్రంలోని కొత్త బస్టాండు ఆవరణలో జిల్లా సదస్సు నిర్వహించారు. భాజపా అధికారంలోకి వచ్చినా హామీలు నెరవేర్చలేదన్నారు. చట్టాలు రద్దు చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోంది: మంత్రి ఎర్రబెల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.