సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఉప కోశాధికారి కార్యాలయం ముందు అమీన్పూర్ మున్సిపాలిటీ కార్మికులు ఆందోళనకు దిగారు. సకాలంలో కోశాధికారి రావటంలేదని నిరసన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ కార్మికులకు వేతనాలు చెల్లించడంలో ఉప కోశాధికారి కార్యాలయ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. మూడు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతుంటే అధికారులకు పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించని పక్షంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.
ఇవీ చూడండి: హారీశ్కు కేటీఆర్ ట్విట్టర్లో జన్మదిన శుభాకాంక్షలు