సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో సోయా రైతులు నిరసనకు దిగారు. ప్రభుత్వం రాయితీపై పంపిణీ చేసిన సుమారు 300 బస్తాలను తీసుకొని నాలుగు వందల ఎకరాల వరకూ సాగు చేసినట్లు తెలిపారు. నాణ్యమైన విత్తనాలు కాకపోవటం వల్ల పొలంలోనే మొలకెత్తకుండా మురిగిపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో నష్టపోయిన రైతులందరూ సమావేశం నిర్వహించి తమను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తూ తీర్మానించారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూడాలని వ్యవసాయ విస్తీర్ణ అధికారి వీరేందర్‌ను కోరారు.