ETV Bharat / state

కల్లు కోసం అల్లాడుతూ... ఆరుగురి మృతి - latest news on six person dead due to no wnne in the estate

కల్లు దొరకలేదన్న చింత వారిని తీవ్రమైన మానసిక వేదనకు గురిచేసింది. కొందరు మూర్ఛవ్యాధికి గురయ్యారు. మరికొందరు బలవన్మరణాలకు పాల్పడ్డారు. వింత ప్రవర్తనతో కొందరు కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేశారు. శని, ఆదివారాల్లో రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో మొత్తం ఆరుగురు మరణించారు. నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

six person dead due to no wnne in the estate
కల్లు కోసం అల్లాడుతూ... ఆరుగురి మృతి
author img

By

Published : Mar 30, 2020, 8:18 AM IST

* వికారాబాద్‌ జిల్లా తోరుమామిడికి చెందిన మొగులయ్య (38) శనివారం అర్ధరాత్రి దాటాక శ్రీనగర్‌కాలనీలో విద్యుత్తు నియంత్రికను పట్టుకున్నారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారు.

* కామారెడ్డి జిల్లా జుక్కల్‌కు చెందిన రాజు (34), పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన లక్ష్మయ్య(60)లు శనివారం రాత్రి కల్లు తాగేందుకని వెళుతూ మార్గమధ్యలో మూర్ఛవచ్చి పడిపోయారు. కుటుంబ సభ్యులు గమనించి వారిని ఇంటికి తీసుకురాగా ఆదివారం తెల్లవారుజామున వారిరువురు తమ ఇంట్లో మృతిచెందారు.

* మెదక్‌ జిల్లా చేగుంటకు చెందిన నత్తి మంగమ్మ (55) కల్లు లభించక మతిస్థిమితం కోల్పోయి ఇంట్లోనే కింద పడి తీవ్రంగా గాయాలపాలై చనిపోయింది.

* వెల్లుర్తి మండలం మాసాయిపేటకు చెందిన కాశమైన కిష్టయ్య (76) తన ఇంట్లోనే దూలానికి ఉరివేసుకుని చనిపోయాడు.

* నిజాంపేట మండలం బచ్చురాజ్‌పల్లి గ్రామస్థుడు కిష్టయ్య (40) కుటుంబ సభ్యులంతా నిద్రపోయిన తరువాత ఇంట్లో నుంచి పారిపోయి స్థానిక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

* సంగారెడ్డి పట్టణ పరిధిలోని పోతిరెడ్డిపల్లికి చెందిన సాదుల్ల కిష్టయ్య మానసిక ఆందోళనతో ఆదివారం కత్తితో పొడిచుకొని గాయపర్చుకున్నాడు.

* ఖైరతాబాద్‌లో నివాసం ఉంటున్న రాజు (40) ఆదివారం చింతలబస్తీలో పోలీస్‌ అవుట్‌పోస్టు సమీపంలోని దుకాణాల ఎదుట మెట్లపై కూర్చుని బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. సైఫాబాద్‌ పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇతడిది మహబూబ్‌నగర్‌ జిల్లా కొడంగల్‌.

* హైదరాబాద్‌లో కార్పెంటర్‌ పనిచేసి జీవించే మర్రివాడ రాంబాబు.. 15 రోజుల క్రితం స్వగ్రామమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పేరాయిగూడెం వచ్చాడు. చాకుతో గొంతు కోసుకున్నాడు. పరిస్థితి విషమంగా ఉండటం వల్ల ఖమ్మం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

* మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేటకు చెందిన నాగరాజు ఆదివారం పటాన్‌చెరులోని భవనం పైకెక్కి రెండో అంతస్తు నుంచి దూకి విద్యుత్తు తీగలపై పడ్డాడు. పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇవీ చూడండి: 'ఆ మూడు పాటిస్తే కరోనా దరిచేరదు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.