లాక్డౌన్ ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంతో పాటు తెలంగాణ-కర్ణాటక సరిహద్దులోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌ను ఎస్పీ సందర్శించారు. ఆంక్షలు అతిక్రమించి అవసరం లేకుండా బయట తిరిగే వ్యక్తుల వాహనాలపై జరిమానా విధిస్తామని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 2 వేలకుపైగా కేసులు నమోదు చేశామని గుర్తు చేశారు.
లాక్డౌన్ అమలు తర్వాత జిల్లాలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతోందని, ఇదే విధంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కేటాయించిన సమయంలో అన్ని కార్యకలాపాలు నిర్వహించుకోవాలని సూచించారు. లాక్డౌన్ సమయంలో బయట తిరిగితే విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు పెడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి; రెండో విడతలోనూ గర్భిణులపై కొవిడ్ తీవ్ర ప్రభావం