సంగారెడ్డి జిల్లాలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ఎస్పీ కార్యాలయ ఆవరణలో మహిళా పోలీసు అధికారులతో ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి సమావేశమయ్యారు. మహిళా ఉద్యోగులకు అన్ని రక్షణ వసతులు కల్పిస్తామని.. వారంతా ఉత్సాహంతో పనిచేయాలన్నారు.
మహిళలు పురుషులకంటే ఎందులోనూ తక్కువకాదని.. వారితో సమాన హక్కులు మహిళలకు ఉన్నాయని తెలిపారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మొబైల్ రెస్ట్రూం బస్సును ఎస్పీ పరిశీలించారు.
ఇవీ చూడండి: తెలంగాణలో కరోనా లేదు: ఈటల