లాక్డౌన్ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. లాక్ డౌన్‌కు ప్రజలు సహకరించాలని కోరారు. పట్టణంలోని వివిధ కూడళ్లు, సరిహద్దుల్లో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి నిఘా పెంచామన్నారు. నిత్యావసర సరుకులు, పాలు, కూరగాయలు, ఔషధాల వాహనాలను అడ్డుకోకుండా ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి అనుమతించాలని ఆదేశించారు. పట్టణం సహా గ్రామాల్లో పరిస్థితులను డీఎస్పీ రాజు, సీఐలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో సామాజిక దూరం పాటిస్తూ, ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించేలా చూడాలని చంద్రశేఖర్ రెడ్డి సూచించారు.
ఇదీ చూడండి: మాస్కు ఎవరు వాడాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?