Retail Business Coach Story in Sangareddy : పెద్ద చదువులు చదివి.. ఇష్టమైన ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలని కలలు కన్నాడు ఓ యువకుడు. కానీ అనుకొని పరిస్థితుల్లో కుటుంబ కష్టాలు ఎదుర్కొన్నాడు. వాటికి ప్రధాన కారణం ఆర్థిక ఇబ్బందులేనని గ్రహించాడు. ఏదొక వ్యాపారం చేసైనా జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలనుకున్నాడు. ఆ ప్రయత్నాల్లో ఒడొదొడుకులు ఎదుర్కొని విజయం సాధించాడు రిటైల్ బిజినెస్ కోచ్ బోయిని విఠల్. సంగారెడ్డి జిల్లా పోతులబోగుడ గ్రామానికి చెందిన ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచి చదువుల్లో రాణించేవాడు. అలా పాఠశాల విద్య అభ్యసిస్తున్న రోజుల నుంచే ఉపాధ్యాయుడు కావాలనే లక్ష్యం పెట్టుకున్నాడు. అయితే కుటుంబ సభ్యుల మరణం ఇతడి గమ్యాన్ని మర్చుకునేలా చేశాయి. చిన్నాన్న ప్రోత్సాహంతో చదువుల్లో ముందుకు సాగాడు. కానీ ఆయన మరణంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ ఘటనల నుంచి బయటపడేందుకు వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత తన సోదరి, చిన్ననాటి స్నేహితుడి సహకారంతో పలురకాల వ్యాపారాలు చేశాడు. కానీ అవి ఏవి సక్సెస్ కాలేదు. దాంతో ఈ వ్యాపారాలు కలిసి రావని.. ప్రయత్నాలే మనేశాడు విఠల్.
Online Business Coach in Sangareddy : కాలం ఎప్పుడు ఒకలా ఉండదు కదా! పైగా చేసిన వ్యాపారాల్లోనూ అనుభవం లేకపోవడమే ప్రధాన లోటుగా భావించాడు విఠల్. 6 నెలల ఖాళీగా ఉన్న తర్వాత స్నేహితుడితో కలిసి రోడ్డుపై కొట్టు పెట్టి బట్టలు అమ్మి జీవనం సాగించాడు. అలా అంచలంచెలుగా ఎదుగుతూ.. 5 బట్టలషాపులు నడిపే స్థాయికి చేరాడు. ఆ స్థాయికి రాడానికి ఆ కష్టం తలచుకుంటే కన్నీరు ఆగదని చెప్పాడు. సరైన ప్రణాళిక, సాధించాలనే పట్టుదల, ముఖ్యంగా ఓటములు నేర్పించిన పాటలు విఠల్‌ను ముందుకు నడిపించాయి. కానీ కరోనా(carona) మరోసారి దెబ్బకొట్టింది. అయితే ఆ సమయంలో ఖాళీగా ఉండకుండా సామాజిక మాధ్యమాల్లో బిజినెస్‌కు సంబంధించిన వీడియోలు చూశాడు. ఆన్‌లైన్ వేదికగా కోచింగ్ కూడా తీసుకున్నాడు. అప్పుడే విఠల్‌కు ఓ వినూత్న ఆలోచన వచ్చిందని తెలిపాడు. విఠల్‌లాగే చాలామంది రకరకాల వ్యాపారాలు చేసి ఫెల్యూర్స్‌ను ఒదుర్కొన్నవారు ఉన్నారు. అలాంటి వారందరీకి వ్యాపారంపై అవగాహన కల్పించాలనుకున్నాడు. అందుకోసం బిజినెస్ ట్రైనింగ్ పాఠశాల ప్రారభించాడు.
"నేను ఈ స్థాయికి రాడానికి చాలా ఇబ్బందులు పడ్డాను. రోడ్డుపై కొట్టు పెట్టి బట్టలు అమ్మి జీవనం సాగించాను. అలా అభివృద్ధి చెందుతూ ఈ స్థాయికి చేరుకున్నాను. బీవీజీ ట్రస్టు ఏర్పాటు చేశాను."- విఠల్, రిటైల్ బిజినెస్ కోచ్
BVG Trust Details in Sangareddy : ఆన్‌లైన్ వేదికగా సాగుతున్న కోచింగ్‌లో తన అనుభవాలనే పాఠాలుగా చెబుతూ వినూత్నంగా నిలుస్తున్నాడు రిటైల్ బిజినెస్ కోచ్(Retail Bussiness Retail Coach). వ్యాపారమే కాక.. బీవీజీ ట్రస్టు కూడా ఏర్పాటు చేసి.. లాభాల్లో 10 శాతాన్ని పాఠశాలల్లో, ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలకు అందిస్తున్నాడు. ఓర్పు, ఆలోచన, సరైన ప్రణాళికతో ముందుకు సాగితే ఏ రంగంలో అయినా లాభాలు సాధించవచ్చని నిరూపించాడు. పరిస్థితులు అనుకూలించకపోయిన పట్టుదల, ఆత్మవిశ్వాసంతో విజయం సాధించవచ్చని తెలిపాడు.
'ఖర్చు తక్కువ.. లాభం ఎక్కువ!'.. రైతు గుర్రాల బిజినెస్.. రూ.లక్షల్లో సంపాదన
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి గాడిదల పెంపకం.. ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నాడు!
online Business Frauds : తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు.. నమ్మి అత్యాశకు పోతే అసలుకే మోసం