సంగారెడ్డి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల చెట్లు నేలకొరిగాయి. పట్టణంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి.
పొలాల్లో కోత కోసి... అమ్మకానికి సిద్ధం చేసిన పంటంతా తడిచిపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటంతా నీటి పాలైందని రైతులు ఆవేదన చెందారు. పంటను కాపాడుకునేేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.