మహారాష్ట్ర ముంబై నుంచి 36 మంది ప్రయాణికులతో వచ్చిన బస్సును సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ శివారులోని చీరాగ్‌పల్లి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన వారు హైదరాబాద్‌కు వస్తుండగా చెక్‌పోస్ట్ వద్ద ఆపేశారు.
మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తున్నందున అప్రమత్తమైన అధికారులు.... బస్సు నుంచి ఎవరినీ కిందికి దిగనివ్వలేదు. వారందరి చేతిపైనా కరోనా క్వారంటైన్ స్టాంపులుండగా... భద్రత మధ్య నిజామాబాద్‌కు తరలించారు.
ఇవీ చూడండి: 27కు చేరిన కరోనా కేసులు.. కట్టడికి కఠిన నిర్ణయాలు